సాక్షి డిజిటల్ న్యూస్, మరికల్, జనవరి 19,2026,( రిపోర్టర్ ఇమామ్ ), మరికల్ మండల కేంద్రంలోని మహబూబ్నగర్ రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారిలో గల పెట్రోల్ బంక్ ముందు ఉన్న డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి డ్రైనేజీ గుంతను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని మరికల్ గ్రామస్తులు, వాహనాదారులు అధికారులను కోరుతున్నారు.