సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్ జనవరి19, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రేషన్ డీలర్లకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చౌక ధార దుకాణాలకు ప్రత్యేక భవనాలను మంజూరు చేయాలని నారాయణ పేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉండే చౌక ధార దుకాణాల కు గ్రామాలలో ప్రభుత్వ అధ్వారంలోనే ఏర్పాటు చేసి ప్రతి డీలర్‌కు ప్రభుత్వమే ప్రతి నెల జీతం రూ,15 వేలు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీలర్లను ఆదుకోవాలని అన్నారు. ప్రస్తుతం చౌక ధార దుకాణాలలో నిత్యవసర సర్కుల సంఖ్యను పెంచాలన్నారు. ఇట్టి విషయంపై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పార్టీ తరఫున కలిసి వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.