రేపు ఇందిర పార్కు వద్ద జరిగే ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయండి

★అడ్డగూడూరు మండల డప్పు కళాకారుల అధ్యక్షుడు బాలెంల (డప్పు) మల్లేష్

సాక్షి డిజిటల్ న్యూస్/ జనవరి 19 అడ్డగూడూర్ రిపోర్టర్ నోముల ఉపేందర్, రేపు హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని అడ్డగూడూరు మండల కళాకారుల అధ్యక్షుడు డప్పు మల్లేష్ అన్నారు .అడ్డగూడూరు మండలంలో ఉద్యమ కళాకారుల పోరు దీక్ష గోడ పోస్టర్ ను డప్పు మల్లేష్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గిలకత్తుల రమేష్ గౌడ్ పాల్గొని గోడ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈనెల 20న ఇందిరాపార్క్ వద్ద ఉద్యమ కళాకారుల పోరు దీక్ష కార్యక్రమాన్ని ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యం లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాల న్నారు. రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న, చైర్మన్ అనువోజు వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్, విమలక్క, ఏపూరి సోమన్న, తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలెంల పాండు, టీవీ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బాలెoల నరేందర్, బాలెంల సురేష్, పోలేపాక అబ్బులు, మేకల పవన్, బోడ సామెల్ ,ఇటికాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.