సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19/2026 మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఉప్పల్ బాగాయూత్ లోని స్వయంభు శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మౌని అమావాస్య హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దినంగా భావించబడుతుంది. ఈ రోజున మౌనం పాటించడం, దైవధ్యానం చేయడం వల్ల ఆత్మశుద్ధి కలిగి సకల దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం.ఈ సందర్భం గా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి ఉప్పల్ నియోజకవర్గం ప్రజల శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.