సాక్షి డిజిటల్ న్యూస్ :19 జనవరి 2026 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలగిరి సిద్ధా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ప్రజాహితమే పరమావధిగా రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన మహానేత, నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ములకలచెరువు మండల కేంద్రంలోని త్రీ రోడ్స్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించబడింది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ములకలచెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, క్లస్టర్ ఇన్‌చార్జ్ గుత్తా సుధాకర్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, పెద్దపాళ్యం గ్రామ కమిటీ అధ్యక్షుడు జె. ఆది, తంబళ్ల శివన్న, గొడ్డుమారి రవి, జాహిర్, పిడుగు రెడ్డప్ప, ఆర్. రామూర్తి, కే. రాము, నడుపు రమణ, ప్రభాకర్ రెడ్డి, సురేంద్ర అన్న, రెడ్డప్ప, కొండరెడ్డి శివమూర్తి, గాలి నారాయణ, లక్ష్మీ నారాయణ, నాగేంద్ర, సీనా, మహేష్, విజయ్, వెంకటధ్రి, సోముశేఖర్, బాతిన సాంబన్న, ఎంపీపీ నరసింహులు, కొటగులు రాజశేఖర్, రమేష్ నాయుడు, కన్నా, చెంకేశవులు, కిరణ్, మధు, శేఖర్ నాయుడు, మోహన్, ప్రతాప్ నాయుడు, సిద్ధన్న (ఎంపీటీసీ), భూపతి, సురేంద్ర, జగన్నాథ్ రాజు, లక్ష్మీపతి, చంద్ర, రమణ రెడ్డి, సోము, ఎం. రామనమూర్తి, రామ్మోహన్, భాస్కర్ రెడ్డి, రఫీ, మల్లప్ప, శ్రీనివాసులు, కృష్ణప్ప, ఎం. రామాంజులు, రవణప్ప, పూజారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
