మద్యం సిండికేట్ నిరంకుశత్వం నశించాలి

★పిసా చట్టం ఉల్లంఘన పై సమగ్ర విచారణ చేపట్టాలి ★ ఏజెన్సీ చట్టాలు బూచిగా చూపెడుతున్నారు ★ దోపిడి దార్లదే రాజ్యం అధికారులు పోస్తున్నారు ఆజ్యం ★ తీరు మారకపోతే తిరుగుబాటుకు గురికాక తప్పదు ★సిండికేట్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆదివాసి నేత కంగాల రమణకుమారి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం సిండికేట్ వ్యాపారస్తులు పిసా చట్టాన్ని ఉల్లంఘించి మద్యం వ్యాపారం చేయటం చట్ట విరుద్ధమని మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ట్ర కన్వీనర్ కంగాల రమణకుమారి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్త పరిచారు ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చట్టాలను అతిక్రమిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాపారం అయినా సరే బినామీ లేని వ్యాపారం లేదని ఆదివాసుల మనుగడకు ఇది ప్రమాదకరమని ఆమె మండిపడ్డారు. ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా మద్యం సిండికేట్ వ్యాపారం కొనసాగుతా ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు వీటి పైన చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని ఆమె అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆదివాసులు తిరుగుబాటుకు గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. పిసా చట్టం అనుసరించి ఏజెన్సీలో గిరిజనేత్ర వ్యాపారాలు కొనసాగాలని కానీ అలా చేయకుండా అధికారుల అండదండతో అలాగే పార్టీ నాయకుల ప్రోత్బలంతో యదేచ్చగా వారి వ్యాపారాలు చేస్తున్నారని చట్టాలు ఉన్న ఏజెన్సీ ఆదివాసులు అభివృద్ధికి దూరంగా ఉంటే ఏ చట్టం లేని గిరిజనేతర వ్యాపారవేత్తలు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయని అధికారులు ఎందుకు స్పందించట్లేదని ఆమె దుయ్యబడ్డారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన పై సమగ్ర విచారణ చేపట్టాలని చట్టాలను చుట్టాలుగా మలుచుకొని మద్యం సిండికేట్ వ్యాపారం దందా కొనసాగుతా ఉందని తక్షణమే ఎక్సైజ్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని పిడి ఆక్ట్ నమోదు చేయాలని ఇక్కడ కూడా చట్టాల ఉల్లంఘన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివాసుల ఆర్థిక అభివృద్ధిని పెంపొందే విధంగా అధికారులు వ్యవహరించాలని ఆమె ఉద్భోదించారు. భద్రాచలం ప్రాంతం మొత్తం కూడా చట్ట పరిధిలో వ్యాపారాలు కొనసాగట్లేదని జిల్లా కలెక్టర్ స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న వ్యాపార వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.