మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని సొసైటీలకు మాటిచ్చారు, మాట నిలుపుకుంటారు

సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 19 - హైదరాబాద్ - రాష్ట్రంలో గానీ, హైదరాబాద్ లో గానీ మన హౌసింగ్ సొసైటీ లాంటి సొసైటీలు అనేకం ఉన్నాయి. గత ఇరవై ఏళ్లుగా ప్రభుత్వాలు సొసైటీలకు గానీ, జర్నలిస్టులకు గానీ ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదు. మన సొసైటీ ఏర్పడి 17 సంవత్సరాలైంది. గత ప్రభుత్వం పదేండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా జాప్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపించి జాప్యం చేస్తుంది. మొన్నీమధ్య సెక్రటేరియట్ లో సమాచార పౌరసంబధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టు సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నేను, నాతో పాటు చాలా మంది జర్నలిస్టు సంఘాల నాయకులు ఇండ్ల స్థలాల అంశంపై గట్టిగా అడగడం జరిగింది. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ప్రత్యామ్నాయ GO ద్వారా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి చెప్పారు. టెక్నికల్ గా ఇబ్బందులు రాకుండా ఏ విధంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలో ఆలోచించి ఖచ్చితంగా చేస్తామని మంత్రి చెప్పారు. మన సొసైటీ సభ్యులు కేవలం రూ. 1050, రూ.1550 సభ్యత్వ రుసుము చెల్లించారు. కానీ అదే జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ సభ్యులు ఒక్కొక్కరు రెండు లక్షలు చెల్లించి 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. నోటికాడికొచ్చిన అన్నం ముద్ద తినలేక పోతున్నారు. మన సొసైటీలోని ఒక సభ్యుడు చేసిన కామెంట్ చాలా బాధ కలిగించేదిగా, నిరుత్సాహపరిచేదిగా ఉంది. "ఏం పీకారు" అనే మాట అత్యంత అభ్యంతరకమైనది. సొసైటీలో సభ్యుడిగా ఉండి పాలక మండలి సభ్యులను ఇలాంటి మాటలతో కించపరిస్తే ఏమౌతుందో అతనికి తెలియనట్లుంది. అలా అనడం సరైందికాదు. జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ ఏర్పడినప్పుడు అందులో చాలామంది హైదరాబాద్ జర్నలిస్టులకు సభ్యత్వం ఇవ్వలేదు. అందుకే 2008లో కేవలం 150 మంది సభ్యులతో మన సొసైటీని ఏర్పాటు చేశాం. మన సొసైటీలో ఇప్పుడు 1350 మంది సభ్యులున్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఎలా నడుస్తుందో, ఆఫీస్ మెయింటెనెన్స్, రెగ్యులర్ మీటింగ్ లు, ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఆడిట్, రిటర్న్స్ ఫైలింగ్ తదితర పనులు ఎలా కొనసాగుతు న్నాయో తెలుసుకోకుండా కేవలం సభ్యత్వ రుసుము, ఐడీ కార్డు ఫీజు చెల్లించి, సొసైటీ పేరుతో లక్షలు, కోట్లు తింటున్నారనే మాట మాట్లాడడం సరైందేనా?. ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకొని ఇండ్ల స్థలాలు ఏ విధంగా సాధించుకోవాలో చెప్పాలని మా విజ్ఞప్తి. అధ్యక్షుడు మామిడి సోమయ్య కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ జి హెచ్ జె మాక్ సొసైటీ.