ప్రమాదకర మలుపులు..సింగిల్ రోడ్డు తో….నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్న రామన్నపేట–అమ్మనబోలు రోడ్డు.?

*ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజలకు డబల్ రోడ్డు మోక్షం కలిగేనా.? *. క్షేత్రస్థాయిలు ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణ ఉందా.? *. కంటికి కనబడని సూచికలు బోర్డులు ? …. వేగ నియంత్రణ సూచికలు బోర్డులు లేవు *10 కిలోమీటర్ల రహదారిలో 15 మలుపులు

.

సాక్షి డిజిటల్ న్యూస్,19 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: రామన్నపేట నుంచి అమ్మనబోలు వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారాయి. రహదారి అనేక ప్రాంతాల్లో ఒకే వైపు వాలిగా ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయినా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రధానంగా రామన్నపేట నుంచి మునిపంపుల, ఎన్నారం వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే 15కు పైగా ప్రమాదకర మలుపులు ఉండటం రహదారి దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మలుపుల వద్ద పెరిగిపోయిన ముళ్లపొదలు, చెట్లు ఎదురుదెరుగా వచ్చే వాహనాలు కనిపించకుండా చేస్తున్నాయి. దీంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు చెబుతున్నారు.అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మలుపుల వద్ద చెట్ల తొలగింపు, సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.ప్రజలకు నిత్యం ఇబ్బందికరంగా మారిన ఈ సింగిల్ రోడ్డును వెంటనే డబల్ రోడ్డుగా మార్చాలని,ఎన్నో దశాబ్దాల కలను ఇక్కడ ఉన్న వివిధ గ్రామాలు, ప్రజల కోరికను తీర్చాలని ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *