తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,మహ నాయకుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి: కోగంటి బాబు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు. జనవరి 19 2026 స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు కంచికచర్ల పట్టణం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్,మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నానని కోగంటి బాబు పేర్కొన్నారు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని అభివర్ణించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని. నియోజకవర్గ నేత కోగంటి బాబు తెలిపారు