చంద్రబాబు విడుదలపై మొక్కు తీర్చుకోనున్న బండ్ల గణేష్

★షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు 'సంకల్ప యాత్ర'

సాక్షి డిజిటల్ న్యూస్ 19/జనవరి/2026 షాద్ నగర్, రిపోర్టర్/కృష్ణ షాద్ నగర్ ప్రముఖ సినీ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవం మరియు రాజకీయ గురువు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన 'సంకల్ప యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ​ చంద్రబాబు నాయుడు పై ఉన్న అక్రమ కేసులు తొలగిపోవాలని, ఆయన జైలు నుంచి క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ బండ్ల గణేష్ గతంలో మొక్కుకున్నారు. సుప్రీం కోర్టు గడపపై నిలబడి "నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేస్తా" అని తిరుమల వేంకటేశ్వర స్వామికి ఆయన మొక్కు చెల్లించుకున్నారు. ​ ఈ నెల 19వ తేదీన (సోమవారం) ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని తన నివాసం వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. ​ షాద్‌నగర్ నుంచి తిరుమల కొండ వరకు నడుచుకుంటూ వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకోవడం. ​రాజకీయ యాత్ర కాదు.. భక్తి యాత్ర ​ఈ యాత్ర గురించి బండ్ల గణేష్ స్పందిస్తూ.. ఇది ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. "నా మనోవేదన తీరిన, నా కోరిక నెరవేరిన వేళ.. నా మాట ఆలకించిన ఆ కలియుగ దైవానికి నా మొక్కుబడి చెల్లింపు మాత్రమే" అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు గారు ఇటీవల అన్ని కేసుల నుంచి ఊరట పొంది, పూర్వ వైభవాన్ని సంతరించు కోవడంతో తన మనసు కుదుటపడిందని ఆయన వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది….