సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 రామకుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 30 వర్ధంతి మీ రామ కుప్పంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూజలను నిర్వహిం చారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పేద ప్రజల బ్రతుకుల్లో వచ్చిన మార్పులపై అదేవిధంగా రాజకీయ చైతన్యం తో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీ రామారావుది అంటూ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి ఆనంద రెడ్డి దేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి కామ్రాజనాయక్ రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ సింగల్ బండ చైర్మన్ మహమ్మద్ రఫీ టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్టనారాయణ చారి మాజీ సర్పంచులు ఆర్కే రామ్మూర్తి కృష్ణా నాయక్ క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి కుప్పం ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి రెస్కో డైరెక్టర్ మనోహర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.