ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్యడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు..

★ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ★స్వగృహంలో ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని

సాక్షి డిజిటల్ న్యూస్ కళ్యాణ్ దుర్గం జనవరి 19, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం పరిధిలో సామాన్యులను సైతం రాజకీయ అక్షరాలు నేర్పి సమాజంలో అందరూ సమానమే అన్న వరవడికి శ్రీకారం చుట్టి తన వాక్పటిమతో పార్టీ స్థాపించిన అనదికాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించి అప్పటి వరకు ఉన్న రాజకీయ పాలనను అంతం చేసి ప్రతి పేదవాడు కడుపునిండా భోజనం చేయాలి అనే సంకల్పంతో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి, ప్రతి పెడవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఢిల్లీ రాజకీయాలను సైతం కంపించేలా చేసి దేశం నలుమూలల తెలుగువాడి పేరు వినిపించేలా చేసిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్బంగా తన స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు, మండల, మున్సిపాలిటీ నాయకులు.అక్కడే భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు కార్యాలయం ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు ..