సాక్షి డిజిటల్ న్యూస్ 19 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్ష కమిటీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో బ్యాలెట్ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి అని సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, జిల్లా, మండల, గ్రామ స్థాయి సంఘాల అధ్యక్ష కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించబడతాయని వెల్లడించారు. గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాల సభ్యులు మరియు కుల బాంధవులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిటీ ఏర్పాటు సంఘం బై లా ప్రకారం, త్వరలోనే కుల పెద్దలతో ప్రత్యేక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తారు అని తెలిపారు. ఎలక్షన్ కమిటీ ద్వారా గ్రామ, మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల పూర్తి డేటా సేకరణ అనంతరం ఎన్నికల షెడ్యూల్, నిబంధనలు అధికారికంగా ప్రకటించబడతాయని స్పష్టం చేశారు. పదవీకాలం అర్హతలు మున్నూరు కాపు పటేల్ సంఘం బై లా ప్రకారం,
రాష్ట్ర అధ్యక్ష కమిటీ పదవీకాలం 5 సంవత్సరాలు కులానికి సేవ చేయాలనుకునే ప్రతి అర్హుడైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు పోటీదారులు మూడు తరాల వంశావళి వివరాలు సమర్పించాలి స్వగ్రామ మున్నూరు కాపు సంఘం నుండి కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి పోటీకి ఉండే పదవులు రాష్ట్ర అధ్యక్షుడు
జనరల్ సెక్రటరీ కోశాధికారి, ఉపాధ్యక్షులు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఈసీ సభ్యులు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసే వారు బై లా ప్రకారం ప్యానెల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే ఇండిపెండెంట్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కుల ఐక్యతే లక్ష్యం ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా,కేవలం కుల అభివృద్ధి, ఐక్యత,భవిష్యత్ తరాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని డాక్టర్ కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు. ఎలక్షన్ కమిటీ డేటా సేకరణకు వచ్చే బృందాలకు అందరూ సహకరించి, కులాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని కోరారు. ఈ సంఘటిత ప్రయత్నాల ద్వారా ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్న మన కులాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలో బై లా మేనిఫెస్టో త్వరలోనే ఎన్నికల కమిటీ ద్వారా మున్నూరు కాపు పటేల్ సంఘం బై లా నిబంధనలు మరియు మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటిస్తామని, కులం పేరు చెప్పుకొని సేవ చేయాలనుకునే వారు ధైర్యంగా పోటీ చేసి గెలవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ కొండ దేవయ్య పటేల్.