అభివృద్ధి లో దూసుకెళ్తున్న వేములవాడ జామే మస్జిద్ కమిటీ అధ్యక్షులు నవాబ్ ఖాన్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.19: వేములవాడ. రిపోర్టర్: పినపాల రుత్విక్… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనన్న ముస్లిం షాది ఖానాకు 80 లక్షలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులు. వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎన్నో ఏళ్లుగా దాదాపు గత 20 సంవత్సరముల నుండి పెండింగ్లో ఉన్న ముస్లిం షాది ఖానాకు 80 లక్షలు మంజూరు చేయడం పట్ల జామే మసీద కమిటీ అధ్యక్షులు నవాబ్ ఖాన్ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే పెండింగ్లో ఉన్న ఖబ్ర స్థానం పనులు అయితేనేమి మరియు లక్ష్మీపూర్ మసీద్ సమస్యను, అలాగే పట్టణంలోని ఉప్పుగడ్డ వీధిలోని జామే మసీద్ శిథిలావస్థకు చేరుకున్నది, ఈ విషయమై కమిటీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే ఆది శ్రీనన్న అతి త్వరలో జామే మసీద్ సమస్యను వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ తో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది, మసీదు సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నది కాబట్టి, మసీదు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది కానీ అతి త్వరలో మసీదు సమస్యను తీరుస్తానని వారు హామీ ఇచ్చారు..