సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 13, హేతుబద్ధమైన అభ్యుదయ భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకనంద అని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు అన్నారు. సోమవారం స్థానిక సీజనల్ హాస్టల్ లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ను ముద్దుగా నరేంద్రనాథ్ దత్త, నరేంద్రుడు అని కూడా పిలిచేవారు, కోల్కత్తాలో విశ్వనాధ్ దత్త ,భువనేశ్వర్ దేవి దంపతులకు, 1863 జనవరి 12న సోమవారం జన్మించారు, మనం జరుపుకునే రోజు కూడా సోమవారం కావడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. నిద్ర, కోపం, భయం, అలసట, సోమరి తనం, ఏరోజు పనులు ఆరోజు చేసుకోకపోవడం వల్ల మనిషి నాశనానికి గురవుతాడని ధైర్యంగా ముందుకెళ్లి నిబద్ధతభవంతో ఏ పనినైనా పూర్తిచేయాలని యువతకు సూచించిన మహానుభావుడు వివేకానంద అన్నారు మనల్ని ఎప్పుడూ రెండు వెంటాడుతుంటాయని , మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకోవడం, గుర్తించు కోవాల్సిన విషయాలను మర్చిపోవడం , మళ్లీ మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు సమాజం మమ్మల్ని గుర్తించి మన గురించి మాట్లాడే విధంగా మనం ఎదగాలని యువతకు ధైర్యం కల్పించిన మహోన్నతుడే స్వామి వివేకానందుడు అని కొనియాడారు విద్యార్థిని విద్యార్థులు స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు, అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , సోహెబ్ దుర్గయ్య సీజనల్ హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.