స్వామి వివేకానంద జయంతి వేడుకలు

★సి ఆర్ పి ఎఫ్ జవాన్ సహకారంతో ★ పాఠశాల విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మణుగూరు ఏరియా సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సి ఆర్ పి ఎఫ్ జవాన్ గుప్త దానం సహకారంతో శ్రీ విద్యాభ్యాస బాల వెలుగు పాఠశాల విద్యార్థులకుసహా పంక్తి భోజనాలు యాభై కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ యువతరాన్ని సన్మార్గంలో నడిపించే దిశగా స్వామి వివేకానంద కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యువత లేవండి మేలుకోండి గమ్యాన్ని చేరే వరకు ఆగకండి. ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం, ఇది అనేక రకాల సాఫల్యాలు వైఫల్యాల నడుము బందీ అయిన జీవితాన్ని సమూనతమైన లక్ష్యం ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశారు. అదే ధైర్యం సాహసం నిస్వార్ధంగా నిర్భయంగా జీవించడం. భయపడకుండా జీవించడమే దైవత్వం అని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే. ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్య మవుతుంది. గొర్రెల గుంపుల పరిగెడితే సింహమైనా సరే తన సహజ లక్షణ ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకు తుందనీ. యువత కూడా తమ నిజ స్వరూపాన్ని మర్చిపోతే అలానే గుంపులో గోవిందంల బ్రతకాల్సొస్తుంది. అని వివేకానంద చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి యువత తమ బాధ్యతను మరిచి వ్యసనాలకు బానిసలు అవుతున్న నేటి తరుణంలో స్వామి వివేకానంద ఆశయాలను ప్రచారం చేయడం ఎంతో అవసరమని ఆయన అభి ప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో బాల వెలుగు పాఠశాల నిర్వాహకులు బి. జగన్మోహన్ రెడ్డి , పాఠశాల అధ్యాపకులు, సామాజిక కార్యకర్త, అంగోత్ టాటా లాల్ తదితరులు పాల్గొన్నారు.