స్వామి వివేకానంద ఆశయాలను ఆచరించాలి: యలమంచిలి ధర్మారావు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 12. కే.కోటపాడు, జనవరి 12: స్వామి వివేకానంద బోధనలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో పాటించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎలమంచిలి ధర్మారావు పిలుపునిచ్చారు. కే.కోటపాడు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి ఉత్సవాలను సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే.కోటపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చీపురుపల్లి రామారావు హాజరై వివేకానందుని జీవిత విశేషాలను గుర్తు చేశారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ మాడుగుల నియోజకవర్గం సెక్రటరీ వేగి రామారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు శాశ్వత ఆదర్శమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకొని దేశ ప్రగతి, అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మాడుగుల నియోజకవర్గ ఉపాధ్యక్షులు కుబిరెడ్డి సన్నిబాబు, సభ్యులు ఎం. అర్జునరావు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లెక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.