సాక్షి డిజిటల్ న్యూస్ నాగలాపురం 13 జనవరి నాగలాపురం మండలం ఎం హరి రిపోర్టు, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ రూపురేఖలు మార్చడం జరిగింది ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కారణంగా ఇదివరకు శ్రీ పల్లి కోటేశ్వరరావు దేవస్థానం నందు మూడు విధులు లేకపోవడంతో రథం ఊరేగింపు భక్తులకు కలగా మిగిలిపోయింది కానీ మూడు సంవత్సరాలకు ముందు రెడీ చేసి ఉన్న రథం ఆలయ మూడు విధులు తిరగడానికి శంకర్ రెడ్డి కృషితో ఆయన 15 లక్షలు విరాళం ఇచ్చి మిగిలిన దాతలు సహాయంతో ఆలయ చుట్టూ మానవీదులు ఏర్పాటుకై భూమి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది.