సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 13 – సికింద్రాబాద్ – లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సిటీ సివిల్ & క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు సమావేశమై, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్యమానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17 జరగబోయే శాంతి ర్యాలీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వరకు బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్లు పాల్గొంటారని వెల్లడించారు. అలాగే ఈ ఉద్యమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ సహాయ కార్యదర్శి టీ. వినోద్ కుమార్ మరియు సహచర అసోసియేషన్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా పూర్తి మద్దతు ప్రకటించారు. పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి అడ్వకేట్ల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. న్యాయపరమైన మార్గదర్శకత్వం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన ఉద్యమ రూపకల్పనలో అడ్వకేట్ల పాత్ర అమూల్యమైనదని తెలిపారు. అడ్వకేట్ల మద్దతు ఉద్యమానికి బలాన్ని, విశ్వసనీయతను మరియు చట్టబద్ధతను కల్పిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. సమితి ప్రధాన కార్యదర్శి బాలరాజ్ యాదవ్,
ఉపాధ్యక్షులు బాబూరావు, శైలేందర్, కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, సాగర్, జగదీష్ గౌడ్, జగ్గయ్య పాల్గొన్నారు