సర్వే నంబర్ 555 ను నిగ్గు తేల్చేదెవరు..?

★కోడి ముందా గుడ్డు ముందా ★కమ్మూరు 555 సర్వే నంబర్ ఎన్ఓసి నకిలీనా..?

సాక్షి డిజిటల్ న్యూస్, కూడేరు జనవరి 12, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కూడేరు మండలం కమ్మూరు రెవెన్యూలో సర్వే నంబర్ 555 ఫై గత కొన్ని సంవత్సరాలగా రెడ్డి, నాయుడు, మిలాకత్ అయిపోయి 13.87 ఎకరాల భూమిని అంచలంచెలుగా, స్థానిక నకిలీ వ్యవహారాల్లో ఆరి తేరిన ముఠాను ఆశ్రయించి నకిలీ రిజిస్ట్రేషన్ లతో తెర వెనక బాగోతం నడుపుతున్నట్టుగా విక్రయాలు జోరుగా జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం, 555 సర్వేనెంబర్ కు ఇదివరలో పుట్టుకొచ్చిన ఎన్ఓసి కూడా నకిలీ ఇదే నాన్న అనుమానాలు బలంగా వినబడుతున్నప్పటికి అహూడ అనుమతులు ఎలా ఇచ్చారు అన్నదే సమస్యాత్మకంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ఆర్ఎస్ఆర్ లో కూడా ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా మార్చడం పరిపాటిగా పెట్టుకుంటూ లేఔట్ వేసి సొమ్ము చేసుకుని ఊడయించడం, మరి ఉన్నపలంగా లే అవుట్లను చెరిపి వేయడం మరి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడం లాంటి నకిలీ వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్లు ప్రజల్లో అనుమానాలు బలంగా వినపడుతున్నాయి. అయితే అసలు విషయానికొస్తే కొందరు పెద్దలు గ్రామాల్లోని రచ్చకట్టల మీద సరదాగా సంభాషించుకుంటున్నప్పుడు కోడి కనిపిస్తే చాలు… కోడి గుడ్డు కథ గుర్తుకొస్తోంది. అయితే కోడి ముందా గుడ్డు ముందా అనేది ప్రశ్న కూడా ఉదయించక మానదు. అయితే కోడి లేకుండా గుడ్డు రాదన్నది ఎంత నిజమో…555 సర్వేనెంబర్ కు నిజమైన ఎన్ ఓ సి రానిదే రిజిస్టర్ జరిగిందన్నది కూడా అంతే నిజం… అయితే ఎన్ఓసి వచ్చిందంటూ ప్రజల మధ్య చక్కెర్లు కొట్టిస్తూ అదే నిజమైన ఎన్ ఓ సి అని ప్రజలను నమ్మించి నకిలీ రిజిస్ట్రేషన్లతో చేతులు మార్చి లక్షల లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటూ ప్రజలను నెత్తిన కుచ్చు టోపీ పెట్టి అమాయక ప్రజలను సైతం మోసం చేయడానికి వెనకాడకుండా అవినీతి అక్రమాలకు తెర లేపుతు న్నట్టు సమాచారం, ఒక ప్రభుత్వ భూమిలో ఇంత గూడుపుఠాణి జరుగుతాఉన్నా రెవెన్యూ అధికారులు మాత్రం నోరు మెదపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే మొన్నటి వరకు తెర వెనక రెడ్డి అనే ప్రకారం జోరుగా సాగి విక్రయాలు జరిపినప్పటికీ నేడు తెర పైకి నాయుడు అన్నట్టుగా రెడ్డి, నాయుడు ఇరువురు మిలాకత్ అయిపోయి స్థానిక నకిలీ వ్యవహారాల్లో ఆరితేరిన కొందరు భూ బ్రోకర్లను అంటగాగుతూ ప్రజలను బురిడీ కొట్టించి అక్రమంగా ప్రభుత్వం భూములను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు.నాడు జిల్లా కలెక్టర్ మంజూరు చేసినట్టుగా ఎన్ఓసి పుట్టుకొచ్చింది. సర్వే నంబర్ 555 విస్తీర్ణం 13.87 ఎకరాలకు కేవలం 7 ఎకరాలకు మాత్రమే ఎన్ఓసి పుట్టించారు. మిగిలిన భూమి ఇంకా వివాదంలో ఉంది. ఈ భూమికి వారసులే తేలుకుంటే ఎన్ఓసి పుట్టుక రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ముమ్మాటికి నకిలీ ఎన్ఓసి నే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నెంబర్ 555. 13.87 ఎకరాల భూమి ప్రభుత్వ భూమేనని దాని పరిరక్షించే బాధ్యతను రెవిన్యూ ఉన్నత అధికారులు తీసుకొని సమగ్ర విచారణ చేసి వారసులు లేని భూమి ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ నకిలీ రియాల్టర్లు మాత్రం, కథనంలో పైన ప్రస్తావించినట్టుగా కోడిని చూడకుండా గుడ్డును మాత్రమే చూసిన గుడ్డు బాగుందనే భ్రమలో నకిలీ రియాక్టర్లు బ్రోకర్లు రెవెన్యూ అధికారులు ఆమ్లెట్ వేయడానికి సిద్ధమయ్యారు. మరి ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిదో జిల్లా రెవెన్యూ అధికారులు చేర్చాలి.