సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.13, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. బి.కొత్తకోట మండలం లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన హార్సిలీహిల్స్ కు తన స్నేహితులతో కలిసి వచ్చి సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు లోయలో పడ్డ సంఘటన సోమవారం తెల్లవారి జామున ఏడు గంటల ప్రాంతంలో జరిగినట్లు బి కొత్తకోట సిఐ గోపాల రెడ్డి తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు తిరుపతిలో ఓ ప్రైవేట్ కాలేజీలో బిటెక్ చదువుతున్న పురుషోత్తం, తన స్నేహితులైన శ్యామసుందర్ ,వెంకటేష్, రెడ్డయ్య ,ధనుష్ ,సాయి, ప్రతాప్ ,శ్యాము సుందర్, వీరందరూ స్నేహితులు వీరు రాజంపేటలో కలుసుకొని రెడ్డయ్యకు చెందిన ఇతియోస్ కారునందు ఆదివారం బయలుదేరి మదనపల్లిలో అందరూ కలుసుకొని వెంకటేశ్వర లాడ్జి నందు ఆదివారం రాత్రి బస చేసి సోమవారం నాలుగు గంటల సమయంలో హార్స్లీ హిల్స్ కు బయలుదేరి వచ్చారు హార్సిలీహిల్స్ నందు సోమవారం ఉదయం 7.30 మధ్యలో జమున బంగ్లా వెనుక వైపు సెల్ఫీ (ఫోటోలు)తీసుకొంటుండగా పురుషోత్తం( 19) ప్రమాదవశాత్తు లోయలోకి పడినట్లు స్నేహితులు. స్థానికులు బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి కి తెలపగా, వెంటనే సీఐ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో తీవ్ర గాయాలతో పడి ఉన్న పురుషోత్తమును లోయలోనుండి బయటకు తీసి మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు, సకాలంలో స్పందిం చిన బి కొత్తకోట సిఐ గోపాలరెడ్డి సిబ్బందిని స్థానికులు అభినందించారు మదనపల్లిలో లోయలో పడ్డ పురుషోత్తం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.