సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 13, మండల కేంద్రమైన హొళగుంద నందు కొండ గుహలలో
స్వయంభుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, మాజీ సర్పంచ్ రాజా పంపన్నగౌడ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, మాజీ సర్పంచ్ రాజా పంపన్నగౌడ్, మాట్లాడుతూ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగనున్నాయని అన్నారు. జనవరి 23వ తేదీన కంకణాధరణ, 26 జనవరిన నంది ఉత్సవం 27 జనవరి న గజోత్సవం 28 జనవరిన మహారథోత్సవం 29వ లంకాదహనం, 30న వసంతోత్సవ కార్యక్రమాలతో రథోత్సవ ఉత్సవాలు ముగియనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ గౌడ్, సిద్దార్థ గౌడ్, సిద్దప్ప, అమరేశప్ప ఆలయ పూజారి సిద్దయ్య థిస్ మంజు కోట్రేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
