శాస్త్రోక్తంగా లక్ష తులసి పూజ

★ ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసన సభ్యులు ★ విశేషం గా కుడారై సేవ ★ ఈనెల 14 న గోదా కల్యాణం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికి ధనుర్మాసం స్వాతి నక్షత్రం సోమవారం మహా పర్వదినం పురస్కరించుకుని లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పాణంగిపల్లి సూర్య నారాయణాచార్యులు బ్రహ్మత్వం లో అర్చకులు బ్రహ్మశ్రీ సుదర్శనం సత్యనారాయాణాచార్యులు ఆధ్వర్యం లో 10 మంది రుత్విక్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముమ్మిడివరం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శేష వస్త్రం తో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో భాగంగా తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారదన, దీక్ష వస్త్ర ధారణ, సుదర్శన హోమం, స్వామి వారు అమ్మర్ల మూల విరాట్ లకు పంచా మృతాభిషేకం అనంతరం లక్ష తులసి పూజ జరిపారు. శ్రీకృష్ణుడు ప్రతిమను ఏర్పాటు చేసి శ్రీ లలిత భక్త మండలి ఆధ్వర్యంలో కుడారై సేవ జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ముఖ్య అతిథిగా వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు తోపాటు మాజీ చైర్మన్ లు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లు అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వాహణాధికారి వి. సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈనెల 14 వతేదీ న ఉదయం గ్రామోత్సవం, సాయంత్రం గోదా రంగ నాధస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు. భక్తులు గ్రామస్తులు పాల్గొనాలని కోరారు.