వివేకానంద ఆశయాలు నేటి యువతకు ఎంతో అవసరం జంపన ప్రతాప్

సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 13 – సికింద్రాబాద్ కంటోన్మెంట్- స్వామి వివేకానంద సూచన మేరకు పడి లేస్తున్న కెరటాలాను నేటి యువత ఆదర్శం తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై వివేకానండుని విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్ చేసారు. ఈ సందర్బంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ రామకృష్ణ మఠం స్థాపించిన వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ మతము ప్రాచుర్యం కల్పించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం శశిరాజ్ యాదవ్, విశ్వనాధం, ప్రకాష్ యాదవ్, ముత్యాలు మల్లేష్ యాదవ్, మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రభుకుమార్ గౌడ్, జగదీష్ యాదవ్, స్థాన్లీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *