వరిగంత గ్రామంలో ఘనంగా వివేకానంద జయంతి

సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చారం మండలం (భూమయ్య) కొల్చారం : మండలంలోని వరిగుంతం గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం వివేకానందుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి విగ్రహానికి గ్రామ యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12న జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం, భారత యువత భవిష్యత్తుపై మరోసారి లోతైన చర్చకు దారి తీస్తోంది. దేశ యువతే రేపటి భారతానికి పునాది అన్న నమ్మకాన్ని వివేకానందుడు ఎప్పుడూ వ్యక్తం చేశాడు. యువ మనస్సుల్లో దాగి ఉన్న నైతిక, మేధో, సామాజిక శక్తే దేశ గమనాన్ని మార్చగలదని ఆయన విశ్వసించాడు. అందుకే ఆయన విద్యపై పెట్టిన దృష్టి కేవలం పాఠ్యాంశాలు, పరీక్షల వరకే పరిమితం కాలేదు. వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఇవే నిజమైన విద్య లక్ష్యాలని ఆయన స్పష్టంగా చెప్పారు. నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో ఈ ఆలోచనలు మరింత ప్రాసంగికంగా మారాయి. వరిగుంతం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్దలు చిన్నలు అందరు కలిసి కులమత బేధాలు లేకుండా జయంతి జరుపుకున్నారు. తిమ్మగారి నారాయణ గౌడ్ అరిగే రమేష్ జోగిపేట బు కరకమలములచే ప్రారంభించబడినది. శ్రీ తిమ్మయ్యగారి నారాయణ గౌడ్, అధ్యక్షులు శ్రీ రమేష్ అరిగె, ఉపాధ్యక్షులు శ్రీ జోగిపేట బుచ్చా గౌడ్, కార్యధర్శి సభ్యులు శ్రీ వడ్ల విఠల్ చారి, శ్రీ వడ్ల శేఖర్ చారి, శ్రీ ముత్యంగారి గోవర్ధన్ (ముదిరాజ్) శ్రీ శేరి బన్నయ్యల శ్రీనివాస్ గౌడ్, శ్రీ జయారావు విశ్వనాథం గుప్త, శ్రీ జోగిపేట రామా గౌడ్, శ్రీ జోగిపేట శ్రీనివాస్ గౌడ్, శ్రీ శేరి సందీప్ గౌడ్, గ్రామ పెద్దలు & గ్రామ ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *