సాక్షి డిజిటల్ న్యూస్ మహాదేవపూర్ మండలం. జనవరి 13 . అంబటి పెళ్లి ప్రీమియర్ లీగ్ సీజన్ టూ విలాసరావు ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో క్రికెట్ ప్రేమికులు వందలాదిగా రావడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఐదు జట్లకు టీ షర్ట్లు మరియు బ్యాట్లు బాల్స్ అన్ని రకాలుగా యువకులకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇట్టి టోర్నమెంట్లో మొదటి బహుమతి కి 10000 రెండవ బహుమతి 5000 మరియు ట్రోఫీ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎర్రవెల్లి విలాసరావు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులకు వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
