సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం మండలం కాలనీలో ఇందిరమ్మ సింగల్ బెడ్రూంలు కట్టే సమయంలో వేసినటువంటి బోర్లను ధరణి అంతిరెడ్డి తన సొంత నిధులతో శుభ్రపరిచి వాటిలో మోటార్లను వేయించడం జరిగింది. దీనివలన కాలనీవాసులకి నీటి కొరత తగ్గిందని చెప్పవలెను కొన్ని సందర్భంలో రోడ్డుపై ఉన్నటువంటి పైప్ లైన్లు పగిలిపోవడంతో నీటి సమస్య చాలా అధికంగా ఉండేదని ఒకప్పుడు కాలనీవాసులు నీరు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. వాటిని మనసులో ఉంచుకొని తాను ఇప్పుడు సర్పంచ్ హోదాలో లేకపోయినా కూడా తన వంతు సహాయంగా కాలనీవాసులకు అండగా ఉంటూ కరెంటు కోతను అలాగే నీటి బాధను లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుండే వ్యక్తి ధరణి అంతిరెడ్డి అంటూ కాలనీవాసులు కొనియాడారు..
