రామన్నపేట ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ఘన సన్మానం

★మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా రమేష్‌కు సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్,12 జనవరి 2026,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: హైదరాబాద్‌లోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మోట్ రమేష్‌కు ప్రత్యేకంగా సన్మానం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గద్వాల్ మాజీ జడ్పీ చైర్మన్ సరిత అక్క, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా మోట్ రమేష్‌ను శాలువాతో సత్కరించి స్మారక చిహ్నాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గ్రామ పాలనలో ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రతినిధులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.ఈ సన్మాన కార్యక్రమంలో బండ లింగస్వామి, మోట్ మహేష్, సిందం వేణు, మధు తదితరులు పాల్గొని మోట్ రమేష్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలనకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.