సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా యువత దేశ ఉన్నతికి పాటుపడాలని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కళాశాల లో స్వామి వివేకానంద చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.