యువత అంటే ఆలోచనలలో నూతనత్వమన్న స్వామి వివేకానంద స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి

★డాక్టర్ పేట భాస్కర్

సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, నేటి యువత కళ్లలో సాధించాలనే లక్ష్యంతో పాటు హృదయంలో దేశం కోసం తపన ఉండాలని ఇనుప కండరాలు ఉక్కు నరాలతో వజ్రాయుధం లాంటి సంకల్పంతో యువజనలు ముందుకు రావాలని యువత అంటే ఆలోచనల లో నూతనత్వమని స్పూర్తి నింపిన వివేకానందడు నేటి యువతకు ఆదర్శం కావాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. సోమవారం సి ప్రభాకర్ స్మారక గ్రంధాల యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు రాస భూమయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ మనలో ఉన్న శక్తిని మనమే నమ్మాలని నిన్ను నీవు నమ్మిన రోజే ప్రపంచం నిన్ను నమ్ముతుందని యువతకు ఆత్మవిశ్వాసం నేర్పిన మహానుభావుడు స్వామి వివేకానందుడు అన్నారు. ఆయన బోధించిన: ధైర్యం, కర్తవ్యబద్ధత, సేవా భావం, ఆత్మవిశ్వాసం ఈ నాలుగు గుణాలే భారతదేశ భవిష్యత్తుకు పునాదులని ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రతి యువకుడు తన జీవితాన్ని ఒక లక్ష్యంగా మార్చుకుని సమాజానికి వెలుగు నిచ్చే దీపంలా నిలవాలని పేట భాస్కర్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రాములు, జిల్లా కార్యదర్శి రామిల్ల రాంబాబు, న్యాయవాది వొటారికారి శ్రీనివాస్, వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాచకొండ పెద్ద దేవన్న, సిపిఐ సీనియర్ నాయకులు ఎం డి మౌలానా, గ్రంథాలయ నాయకులు నామ్తాబాద్ రాజు, రాకేష్, రాజగణేష్, గోపం లక్ష్మీ నారాయణ, డా.వడ్లకొండ ప్రకాష్, అందే వంశీ, న్యాయవాదులు ఎం గంగాధర్,రాసబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.