సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి జెడ్పిటిసి కర్రీసత్యం రైవాడ కలిగొట్ల ఏ కొత్తపల్లిసర్పంచులు చల్లా లక్ష్మీనాయుడు గొర్రెపోటు సుధారాణి చింతల సత్య వెంకటరమణ మొక్కలను నాటారు సోమవారం సర్వసభ సమావేశానికి హాజరైన అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వారు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ప్రాణవాయువును అందిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవి సువర్ణ రాజు పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ మండల స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.