మేకపాటి విక్రమ్ రెడ్డికి పుట్టినరోజు, సంక్రాంతి శుభాకాంక్షలు

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి13 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి విక్రమ్ రెడ్డికి పుట్టినరోజు మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటరీ బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *