మూడు గ్లాసులు… ఆరు పేగులు..

*గ్రామాలలో ఎనీ టైం మందు. *విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) తిరుమలాయపాలెం మండలంలో గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహణ జోరుగా సాగుతున్నది అధికారుల నిర్లక్ష్యం కారణంగా బెల్ట్ షాపుల్లో మద్యం దందా మూడు పువ్వులు ఆరుకాయ లుగా కొనసాగుతున్నది వందల కొద్ది బెల్టు షాపులు నడుస్తున్నాయని ఆరోప ణలు వస్తున్నాయి పలు ప్రాంతాల్లో రెయంబగులు అని తేడా లేకుండా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగు తున్నది అడ్డు అదుపు లేకుండా మధ్య విక్రయాలు జోరుగా సాగుతున్నాయి వైన్ షాప్ వాళ్లు బెల్ట్ షాపులకి ఎమ్మార్పీ కోటర్ కి 20 రూపాయలు చొప్పున ఎక్కువ అమ్మటం వలన బెల్ట్ షాప్ వాళ్ళు ఇంకో 30 రూపాయలు కోటర్కు వసూలు చేస్తున్నారు దీనిపై మద్యం ప్రియులకు ఎమ్మార్పీ కంటే 50 రూపాయలు కోటర్కు అదనపు చార్జీలు వేసి విక్రయిస్తున్నారు బెల్ట్ షాపులు వైన్ షాపులకు అదనపు ఆదాయం చేకూరడంతో పాటు మద్యం విక్రమ్ పెరగటం వారికి ఆదాయం సమకూరు స్తుందని ఆరోపణలు ఉన్నాయి. తిరుమలాయపాలెం మండలం లోని ప్రతి వైన్ షాప్ పరిధిలో లెక్కపెట్టలేనన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని వైన్ షాపులో హోల్సేల్ కాకుండా బెల్ట్ షాపులను ప్రోత్సహించి అధిక రేటు కు అమ్ముతున్నారని దీనిపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొని ఎమ్మార్పీ రేటుకు అమ్మే విధంగా పర్యవేక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *