సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13, రామకృష్ణాపూర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల ఒకటిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగిందని, అభ్యంతరాలు ఈ నెల 9న ముగిశాయని అన్నారు. ప్రజల ద్వారా వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి, అభ్యంతరాల ఆధారంగా గుర్తించి తుది ఓటరు జాబితాను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 29వేల 785 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.16 వ తేదీన వార్డు ప్రకారంగా, పోలింగ్ బూత్ ప్రకారంగా ఫైనల్ ఓటరు లిస్టును అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన ఓటరు జాబితాను ఓటర్లంతా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.