సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 12, రామకృష్ణాపూర్: గడ్డం ఎల్లమ్మ మెమోరియల్ సీజన్ 2 బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ పోటీలను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 14 వ వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు ఆద్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్వహించారు. సుమారు రెండు రోజుల పాటు పోచమ్మ బస్తీలో నిర్వహించిన పోటీలలో సుమారు 32 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ పోటీలలో బెల్లంపల్లి చెందిన విన్సెంట్, వెంకట్ జట్టు మొదటి బహుమతి, మందమర్రి చెందిన రవి, సన్నీ జట్టు రెండో బహుమతి గెలుపొందారు. గెలుపొందిన జట్లకు మాజీ కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు చేతుల మీదుగా నగదు,మెమెంటోలను అందించారు. కాగా మొదటి బహుమతి 5000,రెండో బహుమతి 2500 గెలుపొందిన జట్లకు ఫ్రైజ్ మనిగా అందించారు. ఈ కార్యాలయంలో పోచమ్మ బస్తీ యూత్ నాగరాజు, వికాస్, ప్రభాకర్, శ్రీనివాస్, శంకరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.