సాక్షి డిజిటల్ న్యూస్, , జనవరి 13: రిపోర్టర్ తిరుపతి స్వామి వివేకానంద జన్మదినం సందర్బంగాసిద్దిపేట జిల్లా మార్పడగా గ్రామం లో కచ్చిర్ దగ్గర స్వామి వివేకానంద విగ్రహం నికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. హృదయంలో దేశం కోసం తపన మరియు సంకల్పంతో యువజనలు ముందుకు రావాలని యువత అంటే ఆలోచనలలో స్పూర్తి నింపి నేటి యువతకు ఆదర్శం కావాలని సర్పంచ్ ఆకారం బాలరాజ్ మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, మరియు ఆకారం శివకుమార్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్, సంతోష్, చెల్లాపురం కనకయ్య, దున్న పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.