సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 13 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో మైనారిటీలకు విద్యాపరంగా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే డిసెంబర్ 31, 2025 నుంచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ ప్రాంతంలో ముస్లిం, క్రిష్టియన్ మైనారిటీలు అధికంగా ఉండటంతో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ గురుకుల మైనారిటీ కళాశాలను ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నందున, ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాల మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని “మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్” రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ఈ సందర్భంగా అన్నారు.యంపీజే జిల్లా అద్యక్షులు షేక్ ఖాశిం మాట్లాడుతూ, ఈ సమస్యపై స్ధానిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పందించి ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రశ్నను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత అవసరాన్ని నొక్కి చెప్పారని, అయిన గురుకుల పాఠశాల గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపౌవడం శోచనీయం అని అన్నారు.దయచేసి ఈ ప్రాంత మైనారిటీ ప్రజల అవసరాలు, మనోభావా లను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు మైనారిటీ గురుకుల కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈరోజు మార్కాపురం జిల్లా మార్కాపురంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ “గోపాల కృష్ణ”కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యంపీజే పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.