మామిడి రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

★జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13 2026, అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, మామిడి తోటలను సాగు చేసే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. సోమవారం అనంతగిరి మండలం గొండ్రి యాలా గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మామిడి తోటల సాగు యాజమాన్య పద్ధతులు -సస్యరక్షణ చర్యలపై రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి తోటలు సాగు చేసే రైతులు సమయానుకూలంగా ఎరువులు పురుగుమందులు పిచికారి చేసి చీడ పిడల భారీ నుండి తోటలను రక్షించుకోవాలన్నారు. ఉద్యాన శాఖ అధికారుల, శాస్త్రవేత్త సూచనలు సలహాలు పాటిస్తూ సరైన సమయంలో సరైన మొత్తాదులో రసాయనిక ఎరువులు పురుగుమందులను వాడాలని సూచించారు. కే వి కే గడ్డిపల్లి ఉద్యాన శాస్త్రవేత సి హెచ్ నరేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు మరియు బూడిద తెగులు ఆశించుతుందని నివారణకు, ఎకరాకి 15 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలని ,పూమొగ్గ దశలో ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ - 0.3 మి.లీ. + అజాడిరిక్టిన్ 1500 పి పి ఎం. 2.5 ఎం ఎల్ + హెక్సాకోనజోల్ -2 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. మామిడిలో పూత బాగా రావడానికి మోనో పొటసియం పోస్పేట్ (00-52-34) - 5 గ్రా. + పార్ములా నెం. 4 - 2గ్రా + ప్లానోఫిక్స్ @ 0.1మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు.
పూత అంతా ఒకేసారి వచ్చాక నీటి తడులు ఇవ్వాలని, పర పరాగ సంపర్కం జరిగేటప్పుడు పురుగు మందులు వాడకూడదన్నారు. ఈ కార్యక్రమంకే వి కే సీనియర్ శాస్త్రవేత డి నరేష్, కోదాడ డివిజన్ ఉద్యాన అధికారిని పి అనిత, ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు, పి ఏ సి ఎస్ సి ఈ ఓ మట్టపల్లి రమేష్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్, సిబ్బంది మట్టపల్లి నరేష్, లక్ష్మణ్, గణేష్, రైతులు నెల్లూరి వెంకటప్పయ్య, నెల్లూరి వినయ్, శేషగిరిరావు,వెంకటనర్సయ్య, బాబురావు, వరయ్య, మురళీకృష్ణ, రాధాకృష్ణ, జగన్మోహనరావు, మురళీ, రవి, వెంకటయ్య, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గ్రామం లోని మామిడి తోటలను పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు.