సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13 కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య, రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికే పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులైన షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కోట మండల పరిషత్ కార్యాలయం దగ్గర మండలంలోని పొదుపు మహిళలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సమృద్ధిలో భాగంగా పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ప్రస్తుతం 100 యూనిట్లు కోళ్లను పంపిణీ చేస్తున్నామని 5 వేల రూపాయలకు పైబడిన 11 కోళ్లను కేవలం 3100 రూపాయలకు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో తొమ్మిది పెట్టలు, మూడు పుంజులు ఉన్నాయని వాటిని జాగ్రత్త చేసుకొని మాంసం ద్వారాను, గుడ్ల ద్వారాను మహిళలు ఆర్థికంగా బలపడవచ్చు అన్నారు. అదేవిధంగా వ్యవసాయదారులకు పవర్ స్ప్రేలను 13 వేల రూపాయలు ఖరీదు చేసే వాటిని కేవలం 9000 రూపాయలకు అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం తాసిల్దార్ కటారి జయ జయ రావు, ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ లు మాట్లాడుతూ మహిళలు పెరటి కోళ్ల విషయంలో తగు శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే ఆర్థికంగా బలపడతారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పలనాటి భాస్కర్ రెడ్డి , పెన్నకచెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి, వాకాడుఏఎంసి చైర్ పర్సన్ మర్రి ప్రమీల ,మండల పరిషత్ ఇంచార్జ్ అధ్యక్షులు సౌజన్య రెడ్డి, ఎంపీటీసీలు దారా సురేష్ శంసుద్దీన్, నారాయణ. ఏ పీ ఓ అనిలా టిడిపి మహిళా నాయకురాలు సిద్ధపరెడ్డి పాలమ్మ ,సుహాసిని, పల్లె పల్లె వెంకట కృష్ణారెడ్డి, భాష, కోటేశ్వరరావు, హరిప్రసాద్ రెడ్డి, పొదుపు మహిళలు,మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.