మత్తు రహిత సమాజం కోసం ముగ్గుల పోటీలు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13, (శేరిలింగంపల్లి): ​ఆరోగ్యకరమైన, నేర రహిత సమాజం కోసం మద్యపానాన్ని నిషేధించాలని, మత్తు పదార్థాలను నిర్మూలించాలనే నినాదంతో మియాపూర్ డివిజన్‌లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య నిర్వహించిన ముగ్గుల పోటీలు సోమవారం ముగిశాయి. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని సామాజిక అంశాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. ముగింపు వేడుకలకు ఏబీఎన్ విలేకరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో బి.నమృత ప్రథమ, మన్నే మాధవి ద్వితీయ, అశ్విని తృతీయ బహుమతులు సాధించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సంప్రదాయాలను గౌరవిస్తూనే సామాజిక బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.