సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.13, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. బి.కొత్తకోట మండలంలో సోమవారం బి.కొత్తకోటలో స్వామి వివేకానంద జయంతిని రంగసముద్రంరోడ్డు లోని వకార్స్ ఆధ్వర్యంలో,మరియు బీజేపీ మండల అధ్యక్షులు మేడా ముకుంద ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు, ఈసందర్భంగా వాకర్స్ ప్రతినిధి కృష్ణా రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మేడా ముకుంద సంయుక్తంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వారు మాట్లాడుతూ సర్వమత మహాసభలలో స్వామి వివేకానంద సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం మొదలవగానే చప్పట్లతో వారం రోగిందని భారతీయ సంస్కృతి సాంప్రదాయ సనాతన ధర్మ విషయాలను వివరిస్తూ హైందవ ప్రతినిధిగా హాజరై సర్వమత ప్రతినిధిగా భారతీయ కీర్తి ప్రతిష్టలను హిమశిఖరాల అంచున నిలిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బిజెపి మండల నాయకులు మేడ ముకుంద బాబు సీనియర్ నాయకులు రమేష్ రంగారెడ్డి ఫక్రుద్దీన్ సకల రాము మునిరాజు భయ్యా రెడ్డి భార్గవ్ ఎక్స్ ఆర్మీ ప్రసాద్ తుపాకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.