ప్రజావాణికి అధికారులు డుమ్మా

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 భూమయ్య పిట్లం మండలం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజావాణిలో మండల స్థాయి అధికారులు లేక ప్రజావాణి వేలవేల బోతుంది. సుమారుగా 18 శాఖల మండల అధికారులు పాల్గొనవలసి ఉండగా, కేవలం తహసిల్దార్, ఎంపీడీవో, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ పాల్గొనడం గమనార్హం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ అధికారులు మాత్రం మాకేంటి అనే రీతిలో వివరిస్తున్నారు. తాసిల్దార్ ను వివరణ కోరగా నేను కొత్తగా బాధితులు స్వీకరించిన వచ్చే సోమవారం నుండి అధికారులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. తాసిల్దార్ మహేందర్ కుమార్, ఎంపీడీవో రఘు, తాసిల్దార్ సిబ్బంది ఉన్నారు.