ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

*పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 35 ఫిర్యాదులు.

సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 13, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం మార్కాపురం, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి, ఫిర్యాదిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఫిర్యాదులపై సవివరంగా వివరాలు తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, చట్టపరమైన విధానాల ప్రకారం త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు, భార్య భర్తలు గొడవలు తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ సుబ్బారావు, కంభం సీఐ మల్లికార్జునరావు, పామూరు సీఐ శ్రీనివాసరావు, మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *