సాక్షి డిజిటల్ న్యూస్: 13 జనవరి, పాల్వంచ.రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలో ఎక్సైజ్ అధికారులు సోమవారం అక్రమంగా తరలిస్తున్న 7.4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేశావపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ ఎస్సై శ్రీహరిరావు బృందం ఆటోను తనిఖీ చేయగా ఆటోలో గంజాయి ఉన్నట్లు గుర్తించి, గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశారు.