పట్టణ బిజెపి నాయకులను కలసిన జనసేన నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 భైరం నారాయణ గొల్లపల్లి మండలం పట్టణ బిజెపి నాయకులను కలసిన జనసేన నాయకులు" జనసేన పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జ్ మచ్చ శ్రీనివాస్ అతనితోపాటు నాయకులు రమేష్ జగిత్యాల పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు గారిని మరియు ఇతర నాయకులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి టిడిపి తో కలిసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బిజెపితో కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని దానిలో భాగంగానే సీనియర్ నాయకు లైన ఏసీఎస్ రాజు గారిని ఇతర నాయకులను కలవడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు న్యాయవాది అక్కినపల్లి కాశీనాథం కండ్లపల్లి రాజేశ్వరరావు విట్టల్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.