సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 13/2026, ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు గత 35 ఏండ్లుగా 2లక్షల మందికిపైగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఫామిస్ట్, ఫేస్ రీడర్ రంగాల్లో ప్రసిద్ధిగాంచి తన సేవలనుఖండాంతరాలకు వ్యాప్తిచేసిన తెలంగాణ బిడ్డ ఖమ్మం జిల్లా వాసి డాక్టర్. జి. హరి కిషోర్ గౌడ్ కు ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయి సంస్థల ఆధ్వర్యంలో పలు అవార్డులు దక్కాయి.న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ విభాగాలలో ప్రపంప వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన యువ కెరటం తెలుగు తేజం డాక్టర్ గండు హరికిషోర్.. ఈరంగాలలో సిద్ధహస్తులు కావడం, ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ స్టార్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు. సంస్కృతo, సాహిత్యం, రచయిత, జ్యోతిష్కుడు, సంఖ్యా శాస్త్రవేత్త, హస్తసాముద్రికుడు, ఫేస్ రీడర్ గా, భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ గా, సంస్కృత భాషలో శివపురాణం పుస్తక రచయితగా, జాతీయ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడుగా, భారత దేశ వ్యాప్తంగా తన సేవలు అందిస్తున్న హరికిశోర్ కు ఈపురస్కారాలే మణిహారాలని పలువురు అభివర్ణిస్తున్నారు. ఇంత పిన్న వయసులో సంస్కృత భాషలో ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక రంగానికి చెందిన శివపురాణం అనే పుస్తకాన్ని రచించడం సాధారణ విషయం కాదని, హరి కిషోర్ గౌడ్ కు మంచి భవిష్యత్తు ఉందని, తన సేవలను మరింత విస్తరింప చేసి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని మేధావులు, విద్యావేత్తలు, పలువురు ప్రజాప్రతి నిధులు ఆకాంక్షించారు.. ఈనెల 11 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారోత్సవం ఆదివారం విజయవాడ లోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ హోటల్ లో సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గండు హరి కిషోర్ గౌడ్ కు స్వామి వివేకానంద ఇన్స్పిరేషనల్ నేషనల్ అవార్డ్ దక్కింది. సంస్కృత రచయిత,జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర, హస్త సాముద్రిక సామాజిక, ఆధ్యాత్మిక సేవలకు గాను తానాపూర్వ అధ్యక్షులు ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల నియమితు లైన ప్రముఖ పారిశ్రామికవేత్త, కోమటి జయరాం చౌదరి, కోఆర్డినేటర్ NRI TDP సెల్ సెంట్రల్ ఆఫీస్ కో ఆర్డినేటర్ చప్పటి రాజశేఖర్, ఏపీ మీడియా అకాడమీ పూర్వ కార్యదర్శి.యం బాలగంగాధర్ తిలక్, అంతర్జా తీయ కళావేదిక సీఈవో కత్తిమండ ప్రతాప్, పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు అద్దంకి రాజా
చేతుల మీదుగా వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారాన్ని పొందారు. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, విద్యావేత్తలు మేధావులు రాజకీయ విశ్లేషకులు పలువురు ప్రజా ప్రతినిధులు జర్నలిస్టు మిత్రులు ఇతర ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.