టీ మీడియా క్యాలండర్ ఆవిష్కరణ

★పత్రిక విశ్వసనీయతతో ప్రజల గొంతుకగా నిలుస్తున్న టీ మీడియా దిన పత్రిక. ★తహసిల్దార్ తులసి రామ్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 ఆందోల్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ మల్లేశం, ఆందోల్ నియోజకవర్గం లోని
టేక్మాల్ మండల కేంద్రంలో టీ మీడియా దినపత్రిక మండల రిపోర్టర్ సాయిబాబా ఆధ్వర్యంలో రూపొందిం చిన 2026 టీ మీడియా దినపత్రిక క్యాలండర్‌ను టేక్మాల్ తహసిల్దార్ తులసిరామ్, ఎంపీడీవో రియాజ్ దిన్ డిప్యూటీ తాసిల్దార్ కిషోర్, ఆర్ ఐ సాయి శ్రీకాంత్, స్థానిక విలేకరులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. టీ మీడియా దినపత్రిక ప్రజాసమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ, సామాన్యుల గొంతుకగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు నిజాయితీగా చేరవేయడమే పత్రికల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఆ బాధ్యతను టీ మీడియా దినపత్రిక సమర్థవంతంగా నిర్వర్తిస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విషయంలో పత్రికల పాత్ర అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ కృష్ణవేణి. సర్వేయర్ సందీప్, మండల పత్రిక విలేకరులు సాయిలు, కృష్ణ, రాములు, రాజు, నాయక్, వసంత్ కుమార్, మల్లేశం, అశోక్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.