టిఆర్ఎస్ హయాంలోని చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి

*మున్సిపాలిటీ అభివృద్ధి కుంటూ పడిందని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య *ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి..

సాక్షి డిజిటల్ జనవరి 13 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ హయాంలోని అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల అభివృద్ధి కుంటుపడిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు ఈరోజు చిట్యాల మున్సిపాలిటీలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయల తో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే లింగయ్య పరిశీలించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్క రోజైనా పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించలేదంటే ఆయన ఈ ప్రాంతంపై ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలని లింగయ్య అన్నారు గత రెండేళ్లలో పట్టణ అభివృద్ధికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేశారు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా అక్రమ దందాలకు పాల్పడుతూ సంక్షేమ పథకాల అమలులో కొర్రీలు పెడుతూ పేద ప్రజలను ఇబ్బందుల గురిచే చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిట్యాల పట్టణ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే లింగయ్య పిలుపునిచ్చారు చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే లింగయ్య పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాకీ ఉన్న మొత్తాన్ని వివరిస్తూ వార్డులలో తిరుగుతూ పుర ప్రజలకు వివరించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రజాసంక్షేమానికి పాటుపడే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాజీ కౌన్సిలర్ చేపూరి రవీందర్ ఆరూరి శ్రీశైలం కొలను వెంకటేష్ జంగయ్య సురేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *