జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో

★పైడిపల్లి బీట్ లో సఫారీ చెక్పోస్ట్ పక్కనే విలువైన టేకు దుంగలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోగల కవ్వాల అభయ అరణ్యం టైగర్ జోన్. సంస్వారి పరిధిలోగల మంచిర్యాల నుండి జన్నారం వైపు గల ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు పక్కన జింకల పార్క్ సమీపాన పైడిపల్లి బీట్ పరిధిలో జన్నారం రేంజ్ కు అర కిలోమీటర్ దూరంలో నేలకొరిగిన టేకు భారీ వృక్షాలు తుంటలు మొద్దులు టేకు కలప కడ్డీలు దొంగల రంపాలకు నిదర్శనం అధికారుల అలసత్వం అడవిని కాపాడాలి అని పర్యావరణ ప్రేమికుల ఆవేదన. వృక్షో రక్షితి రక్షితః అనే నానుడిని లెక్క చేయని అధికారులు పేరుకే కవ్వాల్ అభయ అరణ్యం గా బోర్డులకే పరిమితం వేలాదికోట్ల రూపాయలు వృధా స్థానిక యువతకు అడవిని కాపాడే బాధ్యతగా 2000. యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాచర్స్ గా ప్రమోట్ చేసి అడవిని కాపాడాలి అని స్థానిక మండలంలోని పర్యావరణ ప్రేమికులు కోరారు అటవీ శాఖ అధికారులు అందరి పైన పూర్తి వివరణ ఉన్నతాధికారులు చేపట్టాలి.