సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా మండలం.కొల్చారం, జనవరి 13, ( భూమయ్య ) ప్రమాదాలకు కారణ మవుతున్న చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కొల్చారం ఎస్సై మహమ్మద్ ముహీనుద్దీన్ అన్నారు. మాంజా దారం వాడకూడదని సూచించారు. సంక్రాంతి పండుగను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. చైనా మాంజా విక్రయించ కుండా విస్తృతంగా తనిఖీలు చేయబడుతున్నట్లుతెలిపారు. మండలంలో ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తే కొల్చారం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కొల్చారం ఎస్సై మహమ్మద్ మొయినుద్దీన్ తెలిపారు.